Monday, May 12, 2025
Homeజాతీయంపాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తున్నాం

పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తున్నాం

- Advertisement -

– కల్నర్‌ సోఫియా ఖురేషి
ఢిల్లీ : పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తున్నామని కల్నర్‌ సోఫియా ఖురేషి తెలిపారు. శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో కల్నర్‌ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉందన్నారు. 24 చోట్ల ఫైటర్‌ జెట్లతో దాడికి ప్రయత్నించిందని.. పాకిస్తాన్‌ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు చేస్తోందని తెలిపారు. శ్రీనగర్‌, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందన్నారు. ప్రతీగా పాకిస్తాన్‌ ఎయిర్‌ బేస్‌లపై భారత్‌ ప్రతిదాడులు చేసిందన్నా. భారత్‌ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్‌ క్షిపణులను వాడుతున్నామన్నారు. ూ-400ను ధ్వంసం చేశామంటూ పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌ మాట్లాడుతూ.. పశ్చిమ సరిహద్దుల్లో పాక్‌ మిస్సైల్‌ దాడులకు పాల్పడుతుందన్నారు. పాక్‌ ఫైటర్‌ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయన్నారు. పంజాబ్‌లోని పలు కీలకమైన ఎయిర్‌ బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని.. మానవత్వం మరిచి శ్రీనగర్‌లోని స్కూళ్లు, ఆసుపత్రులపై కూడా దాడులకు తెగబడుతోందన్నారు. రాడార్‌ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను కూడా టార్గెట్‌ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్‌లోని విద్యా సంస్థలు, వైద్యాలయాలపై దాడులు చేయడం వారి మానవత్వం లేని చర్యలకు నిదర్శనమన్నారు. అయితే భారత సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉంటూ శత్రువుల ప్రతి చర్యను తిప్పికొడుతోందన్నారు. .
పాక్‌ ఫైటర్‌ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చాయని.. పంజాబ్‌లోని పలు ఎయిర్‌ బేస్‌లను, శ్రీనగర్‌ స్కూళ్లు, ఆస్పత్రులను, రాడర్‌ సెంటర్లు, వెపన్‌ స్టోరేజ్‌ సెంటర్లను కూడా టార్గెట్‌ చేశాయని.. వాటిని తీప్పికొట్టిన్నట్లు తెలిపారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ ఈ రోజు ఉదయం కూడా దాడులు చేసిందన్నారు. పాక్‌ సైన్యం సామాన్య ప్రజలను, వారి ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తుందన్నారు. పాక్‌ దాడులకు భారత సైన్యం ప్రతిదాడి చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -