Wednesday, October 8, 2025
E-PAPER
Homeజాతీయంతొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టుకు టీవీకే పార్టీ

తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టుకు టీవీకే పార్టీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కరూర్‌ తొక్కిసలాట ఘటనలో సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ విజయ్ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసింది. సిట్ తమ పార్టీకి వ్యతిరేకంగా పక్షపాతంతో వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. కాగా SEP 27న టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తేలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -