నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నాటకలోని తుమకూరులో విషాదం చోటుచేసుకున్నది. మర్కోనహల్లి డ్యామ్ గేట్లు తెరవడంతో ఆ నీటి ప్రవాహంలో ఆరు మంది కొట్టుకుపోయారు. తుమకూరు ఎస్పీ అశోక్ కేవీ ఈ ఘటన గురించి వివరించారు. పిక్నిక్‌లో భాగంగా 15 మంది డ్యామ్ వద్దకు వెళ్లారు. దీంట్లో ఏడు మంది చిన్నారులు, మహిళలు నీటిలోకి ప్రవేశించారు. అయితే అకస్మాత్తుగా సైఫన్ సిస్టమ్ తెరుచుకున్నది. ఒక్కసారిగా నీళ్లు డ్యామ్ నుంచి ప్రవహించాయి. శక్తివంతంగా వచ్చిన ఆ వరదతో నీటిలో ఉన్న ఏడుగురు కొట్టుకుపోయారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నాయి. అయితే నవాజ్ అనే వ్యక్తిని రెస్క్యూ చేశాడు. ఆదిచుంచనగిరి ఆస్పత్రిలో అతన్ని చేర్చారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరో నలగురి కోసం గాలిస్తున్నారు. బాధితులందరూ మహిళలు, అమ్మాయిలే ఉన్నారు. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడం వల్లే ఈ ఘటన జరిగినట్లు డ్యామ్ ఇంజినీర్లు చెబుతున్నారు.
ఘోర విషాదం..డ్యామ్ గేటు తెరవడంతో ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES