- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరుడి లాంటి వారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న వ్యాఖ్యల వివాదంపై ఆయన స్పందించారు. ‘‘కాంగ్రెస్‌లో 30 ఏళ్లుగా మాకున్న స్నేహ బంధం రాజకీయాలకు మించింది. మా ఇద్దరి మధ్య అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. మా అనుబంధం ఎవరూ విడదీయరానిది. నేను అడ్లూరి లక్ష్మణ్‌పై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. కొందరు నా వ్యాఖ్యలను రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించారు. వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దీంతో అపార్థాలు కలిగాయి’’ అని ప్రభాకర్ తెలిపారు.
- Advertisement -