- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోని గ్రామంపై క్షిపణి దాడి జరిగింది. బుధవారం జరిగిన ఈ దాడిలో ముగ్గురు మరణించినట్లు స్థానిక గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని అన్నారు. ”ఉక్రెయిన్ సరిహద్దులోని షెబికిన్స్కీ జిల్లాలోని మాస్లోవా ప్రిస్టన్ గ్రామం క్షిపణి దాడికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు” అని గవర్నర్ వ్యాచెస్లావ్ గాడ్కోవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.
- Advertisement -