నవతెలంగాణ – హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ కూటముల్లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మిత్రపక్షం హిందుస్థాన్ అవామ్ మోర్చా 15 సీట్లు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ జీతన్ రామ్ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మాకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే.. గౌరవప్రదమైన సీట్లు కావాలి. మేం 15 సీట్లు డిమాండ్ చేస్తున్నాం. ఆ సీట్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోం. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతాం. నేనేమీ ముఖ్యమంత్రిని కావాలని కోరుకోవడం లేదు. మా పార్టీకి గుర్తింపు కావాలని మాత్రమే ఆరాటపడుతున్నాం’’ అని జీతన్ రామ్ అన్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన బుజ్జగించే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.
మాకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే.. గౌరవప్రదమైన సీట్లు కావాలి: జీతన్ రామ్ మాంఝీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES