Wednesday, October 8, 2025
E-PAPER
Homeబీజినెస్SUV: RX పనితీరు మరింత పెరుగుతోందని ప్రకటించిన లెక్సస్ ఇండియా

SUV: RX పనితీరు మరింత పెరుగుతోందని ప్రకటించిన లెక్సస్ ఇండియా

- Advertisement -

న‌వతెలంగాణ – బెంగళూరు: లెక్సస్ ఇండియా తన RX SUV పనితీరుపై మరోసారి సంచలన ప్రకటన చేసింది.  గతంతో పోలిస్తే… జనవరి నుండి సెప్టెంబర్ 2 వరకు… ఇంకా చెప్పాలంటే గత ఏడాది కాలంతో పోలిస్తే అమ్మకాలు 18% పెరిగాయని ప్రకటించింది లెక్సస్ ఇండియా. గతేడాదితో సెప్టెంబరుతో పోలిస్తే… ఈ సెప్టెంబర్ నెలలో RX 38% వృద్ధిని నమోదు చేసింది. లెక్సస్ ఇండియాను భారతదేశంలో మరింత ముందుకు నడిపించడంలో RX కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. లెక్సస్ కు ఉన్న బలమైన మార్కెట్ మరియు లగ్జరీ SUV విభాగంలో బ్రాండ్ యొక్క విస్తరిస్తున్న పాదముద్రకు ఇది ఎంతగానో  దోహదపడుతుందని మరోసారి నొక్కి చెప్పినట్లు అయ్యింది.

ఈ మధ్యకాలంలో, లెక్సస్ ఇండియా పోర్ట్‌ ఫోలియోలో SUVలు కీలక అభివృద్ధి కారకాలుగా ఉద్భవించాయి. NX, RX & LX నేతృత్వంలోని సంయుక్త SUV మోడల్స్… గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్ 25లో 58% వృద్ధిని సాధించింది. సెప్టెంబర్ 25 నెలలో బ్రాండ్ల మొత్తం అమ్మకాలలో దాదాపు 54% వాటాను అందించింది. ఇందులో SUVలు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి.

లెక్సస్ RX SUV జోరుని కొనసాగించడంలో ముందుంది. అంతేకాకుండా లగ్జరీ పరిశ్రమలో కూడా స్థిరమైన వృద్ధిని అందించడంలో సహాయపడింది. RX అనేది లెక్సస్ యొక్క హాల్‌మార్క్ హ్యాండ్ క్రాఫ్ట్ తో కూడిన శక్తివంతమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ SUV. అధునాతన సాంకేతికత మరియు ప్రీమియం అనుభవాన్ని సమతుల్యం చేసే వాహనాన్ని కోరుకునే అతిథులకు సేవలు అందిస్తుంది.

ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ హికారు ఇకేయుచి గారు మాట్లాడుతూ, “భారతదేశంలో లగ్జరీ SUV విభాగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తూనే ఉంది. జీవనశైలిలో మార్పులు మరియు వివిధ రకాల ట్రావెలింగ్ లో వస్తోన్న మార్పులు పట్ల పెరుగుతున్న ప్రాధాన్యత కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. లెక్సస్ ఇండియాకు, ఈ విభాగం మా విజయానికి ఒక మూలస్తంభంగా ఉంది. ఇది పనితీరు మరియు ఆవిష్కరణలను సజావుగా మిళితం చేసే వాహనాలను అందించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ స్ఫూర్తితో, RX మరోసారి లెక్సస్ ఇండియా యొక్క SUV పోర్ట్‌ఫోలియోకు పునాదిగా తన స్థానాన్ని పునరుద్ఘాటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే జనవరి-సెప్టెంబర్ కాలంలో 18% సంచిత వృద్ధితో దాని బలమైన పనితీరు, RX మా అతిథులతో ఏర్పరుచుకుంటున్న లోతైన సంబంధాన్ని నొక్కి చెబుతుంది.” అని అన్నారు ఆయన.

 ఈ రోజు RX భారతదేశ లగ్జరీ SUV విభాగంలో బలమైన ఆమోదాన్ని పొందుతూనే ఉంది. ప్రధాన మార్కెట్లలో కస్టమర్ డిమాండ్ స్థిరంగా ఉంది. RX రెండు వేరియంట్లతో వస్తుంది. అవి RX 350h, ఇక్కడ హైబ్రిడ్ సిస్టమ్ అత్యంత సమర్థవంతమైన మరియు ప్రతిస్పందించే 2.5-లీటర్ ఇన్‌లైన్ 4-సైలైనర్ ఇంజిన్ మరియు అధిక అవుట్‌పుట్ మోటారును మిళితం చేస్తుంది, అయితే RX 500h f-స్పోర్ట్ 2.4L టర్బోచార్జ్డ్ ఇంజిన్, మోటారు, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు eAxle లను అనుసంధానించే ఫ్రంట్ యూనిట్‌ను కలిగి ఉంటుంది, ఇవి డ్రైవింగ్‌లో ఆనందం మరియు ఉల్లాసాన్ని అందిస్తాయి.

అంతేకాకుండా, ఇటీవల లెక్సస్ ఇండియా స్మార్ట్ ఓనర్‌షిప్ ప్లాన్* (ఖచ్చితమైన బై బ్యాక్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది, దీని లక్ష్యం మెరుగైన స్థోమత మరియు లగ్జరీ కార్ యాజమాన్యాన్ని పునర్నిర్వచించడం. లగ్జరీ యాజమాన్య ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే అతిథుల కోసం ఈ చొరవ ఆలోచనాత్మకంగా రూపొందించబడింది, దీర్ఘకాలిక ఆర్థిక కట్టుబాట్లు లేకుండా లెక్సస్ వాహనాలను అనుభవించే స్వేచ్ఛను అందిస్తుంది. అతిథులు ES, NX మరియు RX కోసం ఈ కార్యక్రమాన్ని పొందవచ్చు.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కోసం లెక్సస్ డీలర్‌ను సంప్రదించండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -