- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: రాష్ట్రాల్లో పిల్లల మరణాలకు కారణమైన కల్తీ ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్ కేసులో తమిళనాడు శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ అరెస్ట్ అయ్యాడు. చెన్నైలో మధ్యప్రదేశ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషపూరిత సిరప్ వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా, రాజస్థాన్‌లో కూడా మరణాలు నమోదయ్యాయి. డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ కంపెనీ లైసెన్స్ సస్పెండ్ చేసి, ఉత్పత్తి నిలిపివేసింది.
- Advertisement -