- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: జనరిక్ ఔషధాలపై ఇప్పట్లో టారిఫ్‌లు ఉండవని తెలుస్తోంది. సెక్షన్ 232 కింద జనరిక్ మందులపై సుంకాల అంశంపై చర్చకు ట్రంప్ కార్యవర్గం సుముఖంగా లేదని శ్వేత సౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ పేర్కొన్నారు. ఈమేరకు శ్వేతసౌధం వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌లో కథనం ప్రచురితమైంది. ఈ నిర్ణయంతో భారతదేశ ఔషధ కంపెనీలకు మేలు జరగనుంది. మరోవైపు బ్రాండెడ్ ఔషధాలపై అక్టోబర్ 1న సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
- Advertisement -