నవతెలంగాణ – కామారెడ్డి
అక్టోబర్ 7న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించబడిన అండర్ 19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కళ్లెం సౌందర్య, బైపిసి ద్వితీయ సంవత్సరం, నేనావత్ చరణ్, బైపిసి ద్వితీయ సంవత్సరం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్, ఇన్చార్జి పిడి బి .రాజేందర్ , కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది , తోటి విద్యార్థినీ విద్యార్థులు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ కళాశాలలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అనేక మందిలో క్రీడా నైపుణ్యాలు దాగి ఉన్నాయని, వాటిని వెలికి తీసి వారిలోని నైపుణ్యాన్ని సాధన చేస్తే రాష్ట్రస్థాయి, దేశ, ప్రపంచస్థాయి క్రీడా పోటీలలో ఇంకా అనేకమంది రాణిస్తారని తద్వారా క్రీడా స్ఫూర్తితో ఉత్తమ పౌర సమాజం నిర్మించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్ గురువారం తెలియజేశారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జూనియర్ కళాశాల విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES