Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక

సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు కే శివకుమార్ ఎన్నికల అధికారిగా గురువారం కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలను నిర్వహించడం జరిగినదనీ టీఎన్జీవోఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి తెలిపారు.

ఈ ఎన్నికలలో భాగంగా అన్ని పదవులకు ఒకటి చొప్పున మాత్రమే నామినేషన్ వచ్చినందున ఎన్నికల అధికారి టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు కే శివకుమార్ అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన అధ్యక్షులుగా సాయి కృష్ణ,  కార్యదర్శిగా నవిత, కోశాధికారిగా బి. నరేందర్  కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్ వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, జిల్లా సహాధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు,  కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -