నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈనెల 7న నవ తెలంగాణ దినపత్రికలో వెలువడిన మహిళలకు అందని ద్రాక్ష స్త్రీ నిధి అనే శీర్షికకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం శ్రీనివాసరావు స్పందించి వివరణ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 22 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని ఇప్పటివరకు 11 కోట్ల రూపాయలు రుణాలను అందించాల్సి ఉండగా 9 మండలాల పరిధిలో 44 గ్రామ సంఘాలకు 9 కోట్ల 38 లక్షల రూపాయలను రుణాలు కోరిన వారికి మంజూరు ఇవ్వడం జరిగిందని వివరించారు. ప్రతినెల రుణాల మంజూరీకగాను సంబంధిత వివో ఏ మరియు విఓఓబి ల నుండి అర్హత కలిగిన గ్రామ సంఘాలలోని సంఘాల సభ్యుల వివరాలను తీసుకుని స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో స్త్రీ నిధి సిబ్బంది కొరత ఉన్నప్పటికీ లక్ష్య సధన కోసం సెరిఫ్ ఉన్నతాధికారులు మరియు అన్ని మండలాల ఏపీఎం, సీసీ, వివోఏ మరియు మండల సమాఖ్య ల ఓబీల అందరి సహకారంతో స్త్రీ నిధి రుణాలను మంజూరి సమయానికి అందిస్తూ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన అన్ని లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. వివరణ కాపీని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారికి కూడా పంపడం జరిగింది అన్నారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES