మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ
నవతెలంగాణ – పరకాల
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల నుండి సమాచారం పొందడం ప్రజల హక్కు అని మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తమ కార్యాలయాలలో ఎలాంటి దాపరికం లేకుండా ఉండడం కోసం సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. పౌరులు ఆయా శాఖల కార్యాలయాలనుండి సమాచారం కోరే పౌరుడు నిబంధనల మేరకు విపులంగా రాసిన ఫారం ద్వారా వివరాలు పొందడం జరుగుతుందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి సమగ్ర సమాచారం అందించడం కా ఉద్యోగులు విధిగా భావించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమాచారం పొందడం ప్రజల హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES