నవతెలంగాణ-హైదరాబాద్: సుప్రీంకోర్టులో దాడి ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పందించారు. తాము షాక్‌కు గురయ్యామని ఆయన పేర్కొన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో సిజెఐపై ఓ న్యాయవాది షూ విసిరేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఆయన స్పందించారు. గురువారం సుప్రీంకోర్టులో సిజెఐ మాట్లాడుతూ.. దాడి ఘటనను ” మరిచిపోయిన అధ్యాయం”గా అభివర్ణించారు. సోమవారం జరిగిన ఘటనపై తాము షాక్‌కు గురయ్యామని అన్నారు. తమ వరకు అది మరిచిపోయిన అధ్యాయమని అన్నారు. సిజెఐపై దాడి ఘటనను మరో జడ్జి ఉజ్వల్ భుయాన్ ఖండించారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయనపై దాడి జోక్ కాదని అన్నారు. జడ్జీలుగా ఇతరులకు సాధ్యం కాని పలు అంశాలను తాము సమర్థవంతంగా నిర్వహించామని అన్నారు. ఈ ఘటన వాటిపై ప్రభావం చూపబోదని అన్నారు.
సిజెఐపై దాడి ఘటన క్షమార్హనీయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఆ ఘటనను మరిచిపోయిన అధ్యాయంగా పరిగణించిన సిజెఐ ఔదార్యం, ఉదారత ప్రశంసనీయమని అన్నారు.