Friday, October 10, 2025
E-PAPER
Homeజాతీయంఆ రాష్ట్ర మ‌హిళల‌కు వేతనంతో కూడిన నెల‌స‌రి సెలవు

ఆ రాష్ట్ర మ‌హిళల‌కు వేతనంతో కూడిన నెల‌స‌రి సెలవు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రుతుక్రమ సెలవును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర కేబినెట్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వస్త్రపరిశ్రమలు, బహుళ జాతి కంపెనీలు, ఐటి సంస్థలు మరియు ఇతర ప్రైవేట్‌ రంగ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఈ సెలవు వర్తించనుంది. శ్రామిక మహిళల ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా వారికి సమ్మిళిత పని వాతావరణాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

రుతుక్రమ సమయంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు మహిళా ఉద్యోగులకు శారీరకంగా, మానసికంగా సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేబినెట్‌ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ నిర్ణయం మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర న్యాయమంతి హెచ్‌.కె. పాటిల్‌ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైందని అన్నారు.

ఇప్పటికే బీహార్‌, ఒడిశా, కేరళ మరియు సిక్కింలు ఈ సెలవును మంజూరు చేస్తున్నాయి.ఈ నిర్ణయంతో కర్ణాటక కూడా రుతుక్రమ సెలవులను అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -