Friday, October 10, 2025
E-PAPER
Homeకరీంనగర్కోర్టు ఉత్తర్వులు పాటించనందుకు ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తు

కోర్టు ఉత్తర్వులు పాటించనందుకు ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామగ్రిని స్థానిక సబ్‌కోర్టు గురువారం జప్తు చేసింది. రైల్వేలైన్‌ కోసం సేకరించిన భూమికి సంబంధించి పరిహారం చెల్లింపుపై ఇచ్చిన ఉత్తర్వులు పాటించనందుకు ఆర్డీవో కార్యాలయంలోని ఫర్నిచర్, బీరువాలు, ఫ్యాన్లను కోర్టు సిబ్బంది జప్తుచేసి న్యాయస్థానానికి తరలించారు. పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి జగిత్యాల మండలం లింగంపేటలో 2003లో 253 మంది రైతుల నుంచి సుమారు 100 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి 2006లో ఎకరానికి రూ.1.24 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు చెల్లించారు. కాగా విలువైన భూములకు తక్కువ పరిహారం చెల్లించారంటూ రైతులు జగిత్యాల సబ్‌కోర్టును ఆశ్రయించారు. దీంతో ఎకరానికి రూ.10.64 లక్షలు చొప్పున ఇవ్వాలంటూ 2010 జులై 23న కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై రెవెన్యూ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో హైకోర్టు సైతం ఎకరానికి రూ.15.97 లక్షలు ఇవ్వాలని తీర్పునివ్వగా రైల్వేశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగిత్యాల సబ్‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు 2018 జులై 28న పేర్కొనగా దీనికి సంబంధించి రైతులకు రూ.4.82 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని తమకు చెల్లించకపోవడంతో రైతులు తిరిగి సబ్‌కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో కార్యాలయ సామగ్రిని జప్తుచేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సంబంధిత రైతులు ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -