Friday, October 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపేలిన గ్యాస్ సిలిండర్.. బీటెక్‌ విద్యార్థి మృతి

పేలిన గ్యాస్ సిలిండర్.. బీటెక్‌ విద్యార్థి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ మారుస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆనంద్ స్వరూప్ అనే బీటెక్ విద్యార్థి (22) మృతి చెందాడు. సిలిండర్‌ లీక్‌ కావడంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. అయితే ఆనంద్ స్వరూప్ సిలిండర్‌ను మార్చే క్రమంలో ప్రమాద వశాత్తు పేలిపోయిందని అతని తండ్రి భాస్కర్ తెలిపారు. తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించామని, అయితే చికిత్స పొందుతూ చనిపోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -