నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీపై పాలనలో దళితుల పట్ల దేశవ్యాప్తంగా కులదురహంకార హింస పెరిగిపోతుందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు దినదినం భయాందోళనతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పూరన్ కుమార్ ఆత్మహత్యతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని, కులంపేరుతో వేధించి సీనియార్ అధికారులు అతని ఆత్మహత్యకు ప్రేరేపించారని శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు. ఈ తరహా సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, దళితుల పట్ల దాడులకు, హింస, అన్యాయనికి బలైపోతున్నారని తెలిపారు.బీజేపీ పాలన దళితులకు శాపంగా మారిందన్నారు. సాధారణ పౌరుడై వారు దళిత సమాజానికి చెందినవారైతే, వారి పట్ల అవమానీయంగా, మానవతం లేకుండా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. కులంపేరుతో ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఇటీవల హర్యానా ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన వై. పూరన్ కుమార్ సర్వీస్ రివ్వాలర్‌తో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.
కులవేధింపుల కారణంగా పూరన్ కుమార్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఐపీఎస్ చావుకు కారణమైనా వ్యక్తులపై వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది షూతో దాడికి యత్నించిన సంఘటనను కూడా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఖండించారు.