Friday, October 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా పాక్‌లో ఆందోళ‌న‌లు

ఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా పాక్‌లో ఆందోళ‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్తాన్‌లో తెహ్రీక్‌ – ఎ- లబ్బాయిక్‌ పాకిస్తాన్‌ (టిఎల్‌పి), రాడికల్‌ ఇస్లామిస్ట్‌ పార్టీ శుక్రవారం ‘లబ్బైక్‌ యా అక్సా మిలియన్‌ మార్చ్‌’కు పిలుపునిచ్చాయి. దీంతో రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండిలలో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవల్ని పాకిస్తాన్‌ ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే రాజధాని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది. గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా గురువారం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో టిఎల్‌పి సభ్యులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో డజన్లకొద్దీ గాయపడ్డారు. ఈ చర్యకు వ్యతిరేకంగా టిఎల్‌పి, రాడికల్‌ ఇస్లామిస్ట్‌ పార్టీలు నేడు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలకు ముందు పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేసింది. పంజాబ్‌ ప్రభుత్వం ప్రావిన్స్‌ అంతటా 144 సెక్షన్‌ని విధించింది. నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలను పదిరోజులపాటు నిషేధించింది. అలాగే రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో కూడా నేడు 144 సెక్షన్‌ అమలులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -