Friday, October 10, 2025
E-PAPER
Homeజాతీయందగ్గు సిరప్‌ మరణాలపై పిల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

దగ్గు సిరప్‌ మరణాలపై పిల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మధ్యప్రదేశ్‌లో నాణ్య‌త‌లేని కోల్డ్రిఫ్‌ దగ్గు సిరప్‌తో 22మంది మరణించిన సంగతి తెలిసిందే. దగ్గు సిరప్‌ మరణాలపై జ్యుడీషియల్‌ కమిషన్‌ లేదా నిపుణుల కమిటీతో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. న్యాయవాది, పిటిషనర్‌ విశాల్‌ తివారీ తన కెరీర్‌లో ఎన్నిసార్లు పిల్‌లు దాఖలు చేశారని ప్రశ్నించింది.

ప్రస్తుతం నిషేధించబడిన కోల్డ్రిఫ్‌ సిరప్‌ తయారీ సంస్థ ఉన్న మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు పరస్పరం నిందించుకుంటూ, విమర్శలకు దిగుతున్నాయని, రాష్ట్రాల దర్యాప్తులో ఎటువంటి గణనీయమైన చర్యలు తీసుకోకుండానే సమయం వృధా అవుతోందని తివారీ అన్నారు. తివారీ కేంద్రీకృత దర్యాప్తును కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -