- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 2025 సంవత్సరానికిగాను నోబెల్ శాంతి బహుమతిని వెనెజులాకు చెందిన మారియా కొరినా మచాడోను వరించింది. గత నాలుగు రోజులుగా నోబెల్ కమిటీ వరుసగా విభిన్న రంగాల్లో శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తోంది. శాంతి బహుమతిని వెనిజులాకి చెందిన మారియా కొరినా మచాడోకు ప్రకటించినట్లు నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం తెలిపింది. గతేడాది, నోబెల్ శాంతి బహుమతిని జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యో సంస్థకు ప్రదానం చేశారు. హిరోషిమా, నాగసాకిల్లో అణుబాంబు దాడి నుండి బయటపడిన వారంతా ఈ సంస్థ కింద అణు ప్రయోగాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమాన్ని హిబాకుషా అని కూడా పిలుస్తారు.
- Advertisement -