నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బంజర గ్రామ శివారు నంద్యాల తండాలో ఆంజనేయ స్వామి ఆలయ గుడి నిర్మాణానికి ఇసుక పర్మిషన్ల ఇప్పించాని నెల్లికుదురు తహశీల్దార్ చందా నరేష్ కు వినతి పత్రం అందించినట్లు ఆ తండాకు చెందిన బానోతు వీరభద్రం బానోతు కిషన్ లు తెలిపారు. శుక్రవారం తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంజర గ్రామపంచాయతీ పరిధిలోని నందియా తండాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నందున ఇసుక కావలసి వచ్చిందని దానికోసం తహశీల్దార్ చందా నరేష్ ను ఒక పది ట్రిప్పుల ఇసుక పర్మిషన్ ఇప్పించాలని కోరామని అన్నారు. తహశీల్దార్ వెంటనే స్పందించి ఆలయ నిర్మాణానికి అయితే సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో తండావాసులు కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తండావాసులు ఉన్నారు.
గుడి నిర్మాణానికి ఇసుక పర్మిషన్ ఇవ్వాలని తహశీల్దార్ కు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES