Saturday, October 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆఫ్ఘనిస్థాన్‌కు బహుమతిగా అంబులెన్స్‌

ఆఫ్ఘనిస్థాన్‌కు బహుమతిగా అంబులెన్స్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆఫ్ఘనిస్థాన్‌కు ఐదు అంబులెన్స్‌లను భారత్‌ బహుమతిగా ఇచ్చింది. భారత్‌లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకికి, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ శుక్రవారం వీటిని అందజేశారు. సద్భావన సంజ్ఞగా ఆఫ్ఘనిస్థాన్‌కు 20 అంబులెన్స్‌ల బహుమతిలో భాగం ఆ దేశ విదేశాంగ మంత్రి సమక్షంలో ఐదింటిని అందజేసినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌కు మరింత సహాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు ఎస్‌ జైశంకర్ తెలిపారు. ఆరు కొత్త ప్రాజెక్టులను ఆ దేశంలో చేపడతామని చెప్పారు. ముఖ్యమైన దౌత్య చర్యలో భాగంగా కాబూల్‌లోని సాంకేతిక మిషన్‌ను భారత రాయబార కార్యాలయ హోదాకు శుక్రవారం అప్‌గ్రేడ్ చేసినట్లు ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రజల పొరుగు దేశంగా, శ్రేయోభిలాషిగా ఆ దేశ అభివృద్ధి, పురోగతిపై భారత్‌ చాలా ఆసక్తిగా ఉన్నదని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -