నవతెలంగాణ – హైదరాబాద్: టెన్నెస్సీ : అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మిలిటరీ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మరణిచినట్లు సమాచారం. పేలుడు తరువాత 19మంది ఆచూకీ తెలియడం లేదని స్థానిక అధికారులు ప్రకటించారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఉదయం ఎనిమిది గంటలకు (స్థానిక కాలమానం) ఈ ప్రమాదం జరిగింది. టెన్నెస్సీ రాష్ట్రం సౌత్ వెస్ట్ ఆఫ్ నాష్ విల్లే లోని మిలిటరీ ప్లాంటులో ఉన్న అక్యురేట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్లాంట్ వద్ద ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ప్లాంట్ నుంచి వచ్చిన దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
విషాదం: ఆయుధ ఫ్యాక్టరీలో పేలుడు..19 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES