Monday, May 12, 2025
Homeజాతీయంఆపరేషన్‌ సిందూర్‌పై రాజ్‌నాథ్ ప్ర‌శంస‌లు

ఆపరేషన్‌ సిందూర్‌పై రాజ్‌నాథ్ ప్ర‌శంస‌లు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆపరేషన్ సిందూర్‌పై ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఉన్న రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి ఆపరేషన్‌ సిందూర్‌ నిదర్శనమన్నారు. పహల్గాం ఉగ్రదాడి కి ధీటైన సమాధానం ఇచ్చిందని చెప్పారు. లక్నోలో వర్చువల్‌ విధానంలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌ తో ఉద్రిక్తతల వేళ భారతసైన్యం ధైర్య సాహసాలతోపాటు సంయమనాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్‌లోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేసి ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింద‌ని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -