Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

- Advertisement -

నవతెలంగాణ – ధన్వాడ 
తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల ముందు హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నెలలోపు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులను పిలిచి పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కార రూపం దాల్చలేదు. కనుక ఇప్పటికైనా ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటి తారీకు వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న జిల్లా ప్రభుత్వ సెక్టోరియల్ అధికారుల, జిల్లా సమగ్ర శిక్ష సిబ్బంది, మండలంలోని ఎమ్మార్సీలో పనిచేస్తున్న సిబ్బంది, పాఠశాలలలో పనిచేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు నేటి వరకు వేతనాలు రాలేక ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా వేతనాలు చెల్లించి ప్రతినెల 1వ తారీఖు నాడు వేతనాలు చెల్లించాలని కోరడమైనది.

 తెలంగాణలోని సమగ్ర శిక్ష లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత లేక మరణించిన ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడడం జరిగింది. ప్రమాదానికి గురైన ఉద్యోగులు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు ఆర్థిక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు కనుక రూ.50,00,000/- ఎక్స్ గ్రేషియా రూ.50,00,000/-బీమా సౌకర్యం హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో నీరటి రాఘవేందర్ నాయుడు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, కుమ్మరి వెంకట్రాములు సమగ్ర శిక్ష జిల్లా నాయకులు, ఎండి సలీం సమగ్ర శిక్ష జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -