Saturday, October 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌లో ఉద్రిక్త‌త‌.. 11 మంది నిరసనకారులు మృతి

పాక్‌లో ఉద్రిక్త‌త‌.. 11 మంది నిరసనకారులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ చేప‌ట్టిన‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, నిర‌స‌న‌కారుల‌కు మధ్య తీవ్ర వాగ్వావాదం నెల‌కొంది.దీంతో పంజాబ్ పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది నిరసనకారులు మరణించారని, 50 మందికి పైగా గాయపడ్డారని టీఎ‌ల్‌పీ చెప్పింది. గాజాలో ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా గురువారం నిరసనలు ప్రారంభమయ్యాయి. పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాహోర్‌లోని ఆజాదీ చౌక్ సమీపంలో ఘర్షణలు తీవ్రమయ్యాయి. పోలీసులు వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు, ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న నిరసనకారుల్ని అడ్డుకునేందుకు రోడ్లపై కంటైనర్లను మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -