నవతెలంగాణ – రెంజల్
ఇటీవల కురిసిన వర్షాలకు కందకుర్తి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రెంజల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం సమీపంలోనీ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, స్థానిక ఎమ్మెల్యే వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరానికి 40 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేషు గారి భూమారెడ్డి, స్థానిక నాయకులు రఫీక్, వికార్ పాషా, ఎండి మౌలానా, కాశం సాయిలు, రఘు, తిరుపతి రాము, ముఖీద్, మోసీన్, ఖలీద్, బైండ్ల రాజు, అసాద్ బేగ్, ఫిరోజ్ద్దీన్, ఇబ్రహీం, గుంజే గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పంటనష్టం చెల్లించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES