Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్13న ఛలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం

13న ఛలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం

- Advertisement -

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంథని చిరంజీవి మాదిగ
నవతెలంగాణ- కాటారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసిన లాయర్ పై దేశంద్రోహం కేసు నమోదు చేయాలని కాటారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ డిమాండ్ చేశారు. శనివారం కాటారం కేంద్రం లో గల అంబెడ్కర్ సెంటర్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ ఆర్ గావాయ్ పై దాడి జరగడం దారుణమని దాన్ని ఖండిస్తూ ఈ నెల 13న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమానికి మండలంలోని దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జస్టిస్ గవాయ్ పై దాడియత్నం కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -