-ఇసుక రవాణదారుడి అరెస్ట్
-రిమాండుకు తరలింపు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక నిల్వలపై ఎస్ఐ సౌజన్య కొరడా ఝులిపించారు.అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను స్వాధీనపర్చుకుని ఇసుక రవాణ చేస్తున్న ట్రాక్టరును పోలీస్ స్టేషనుకు తరలించి యాజమానిపై కేసు నమోదు చేసినట్టు శనివారం ఎస్ఐ సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు.ఇసుక నిల్వ చేసిన రవాణదారుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు ఎస్ఐ పెర్కొన్నారు.అనుమతుల్లేకుండా ఇసుక రవాణ చేసినా..అనుమతులు ఉల్లంఘించి అధికంగా తరలించినా..అక్రమంగా ఇసుక నిల్వలేర్పాటు చేసిన ఉపేక్షించేదిలేదని ఎస్ఐ సౌజన్య హెచ్చరించారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత..పరిశీలించి విడుదల
అనుమానాస్పదంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టరును పోలీసులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషనుకు తరలించారు.సంబంధిత అధికారులను విచారించి అనుమతులు పరిశీలించి విడుదల చేసినట్టు ఎస్ఐ సౌజన్య తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణ చేస్తున్న ట్రాక్టర్ల యాజమానులు,డ్రైవర్లు అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలు వెంట ఉండాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ సూచించారు.