నవతెలంగాణ-హైదరాబాద్: కరూర్ తొక్కిసలాట ఘటన సెప్టెంబర్ 27న టీవీకే ప్రచార సభలో జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలో విజయ్ ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి నేరుగా పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాటలోని బాధిత కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలవాలన్న ఉద్దేశంతో తమిళనాడు డీజీపీకి ఈమెయిల్ ద్వారా అనుమతి కోరారు. భద్రతా కారణాల వల్ల విజయ్ పరామర్శను ఒకే వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇంటింటికి వెళ్లి బాధితుల్ని కలవడం వల్ల గందరగోళం నెలకోవడంతో పాటు, అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని అందుకే విజయ్‌కు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
కరూర్ తొక్కిసలాట..నేడు బాధితులకు విజయ్ పరామర్శ
- Advertisement -
- Advertisement -