నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాబుల్‌లో పాక్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు ఇరుదేశాల బలగాలు శనివారం రాత్రి సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సరిహద్దు ప్రాంతలైన కైబర్-పఖ్వుక్తన్ బలూచిస్థాన్, దాన్లపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీంతో అప్రమత్తమైన ఆఫ్గాన్ బలగాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి. పాకిస్థాన్‌కు చెందిన పలు సరిహద్దు ప్రాంతాలపై తాలిబన్ సేనలు ప్రతిదాడులకు దిగాయి. దీంతో ఇరుదేశాల మధ్య కాసేపు యుద్ధ వాతావరణం తలపించిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. కాల్పుల మోతతో ఆయా దేశాల సరిహద్దు ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏ వైపు నుంచి వచ్చి తమపై బాంబుల పీడుగు పడుతోందని స్థానికులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటు రాత్రి గడిపారు.
ఈ దాడుల్లో తాలిబన్ కు చెందిన పలు ఆర్మీ కేంద్రాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. ఖైబర్-పఖ్తుంఖ్వాలోని అంగుర్ అడ్డా, బజార్, ఖుర్రం, డీర్, పిక్చర్స్ బలూచిస్తాన్‌లోని బ్రాంచ్‌లపై కాల్పులు జరిపిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. పాకిస్తాన్ -ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న కునార్, నంగర్హార్, పాక్టికా, ఖోస్ట్, హెల్మండ్ ప్రావిన్సుల నుండి కాల్పులు జరిగినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు.