Sunday, October 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేప‌ట్నుంచి ‘జూబ్లీహిల్స్’ నామిష‌న్ల స్వీక‌ర‌ణ‌

రేప‌ట్నుంచి ‘జూబ్లీహిల్స్’ నామిష‌న్ల స్వీక‌ర‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు జూబ్లీహిల్స్ బైపోల్‌కు షెడ్యూల్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. రేప‌ట్నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ల కేంద్రంగా ఉన్న షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ మండలం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్ డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 9 మంది ఎస్ఐలతో పాటు 59 మంది సిబ్బంది, రెండు ప్లాటూన్ల బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఈ భద్రతా వలయం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు, ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత పేరును ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ బరిలో నిలవనున్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నామినేషన్లు వేయడానికి పది రోజుల సమయం ఉండటంతో, అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -