Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చార్జీలు పెంచాలంటూ టిప్పర్స్ అసోసియేషన్ సమ్మె

చార్జీలు పెంచాలంటూ టిప్పర్స్ అసోసియేషన్ సమ్మె

- Advertisement -

బొగ్గు రవాణాకు ఆటంకం కలిగేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు

బొగ్గు రవాణాలో చెల్లించే చార్జీలు పెంచాలంటూ మండల టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరినేని రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో టన్నుకు రూ.250 చెల్లిస్తున్నారని, అవి ఏ మాత్రం సరిపోవడంలేదంటూ,తన్నుకు రూ.300 చరిల్లించాలంటూ సమ్మె బాట పట్టినట్లుగా తెలిపారు. సమ్మె చేపట్టిన నేపథ్యంలో మండల వ్యాప్తంగా 75 టిప్పర్ లారీలను ఎక్కడికక్కడి నిలిపివేశారు. తాడిచెర్లలోని కాపురం ఓసీపి-1నుండి కేటీపీపీ చెల్పూరుకు కోల్ ట్రాన్స్ పోర్టింగ్ సంబంధించి ఇస్తున్న పాత కిరాయి గిట్టుబాటు కావడం లేదని అసోసియేషన్ సభ్యులు పలుమార్లు ట్రాన్స్ పోర్ట్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వెల్లడించారు. ట్రాన్స్ పోర్ట్ అధికారులు,ఏఎమ్మార్ యాజమాన్యం స్పందించేంత వరకు తమ సమ్మె విరబించబోమని స్పష్టం చేశారు.

దీంతో బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడనుందా.? అనే సందేహాలు వెలువడుతున్నాయి. టిప్పర్ అసోసియేషన్తో పాటు ఇతర లారీలన్నింటిని సైతం మద్దతు తీసుకొని సమ్మెకు సహకరించేలా పూర్తి స్థాయిలో రవాణానిలిచిపోయేలా అసోసియేషన్ల లంతా ఏకమవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే జరిగితే రోజుకు 300 లారీల బొగ్గు రవాణాకు ఆటంకం కలిగి సంస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది.అసోసియేషన్ సమ్మెతో 300 మంది ఒన్సర్ అండ్ డ్రైవర్స్ రోడ్డున పడనున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పోటు సమ్మిరెడ్డి,ప్రధాన కార్యదర్శి బడికెల నర్సయ్య, కోశాధికారి కాసర్ల అజిత్ రెడ్డి,సహాయ కార్యదర్శి శనిగరం రమేష్ తోపాటు 70 మంది టిప్పర్ యజమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -