- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నలుగురు యువకులకు పెను ప్రమాదం తప్పింది. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్, ఆర్ఫాద్, సికిందర్, షరీఫ్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే అలలు బాగా ఉధృతంగా ఎగిసిపడుతున్నా. అయినా సరే సముద్రంలోకి వెళ్లి స్నానం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి నలుగురు యువకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నీళ్లలో కొట్టుకుపోయేంత పని అయింది. అయితే ఒడ్డున ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు నాంచారయ్య, శేఖర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తాడు సాయంతో నలుగురు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
- Advertisement -