- Advertisement -
జాగృతి జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజశేఖర్
నవతెలంగాణ – మద్నూర్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఈనెల 22 నుండి పర్యటన కార్యక్రమాలు ఉన్నట్లు జుక్కల్ నియోజకవర్గం జాగృతి ఇంచార్జ్ రాజశేఖర్ తెలిపారు. ఆయన మద్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి జిల్లా పర్యటన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి మండలంలో జాగృతి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, కమిటీలు అనంతరం జాగృతి కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జాగృతి మద్నూర్ నాయకులు సురేష్ గౌడ్ జాగృతి బిచ్కుంద నాయకులు బాలరాజ్ పాల్గొన్నారు.
- Advertisement -