నవతెలంగాణ-హైదరాబాద్: సీతాఫల్మండీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో.. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ బగల భారతి నాయకత్వంలో, జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం ఈ రోజు కొర్రేముల గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బగల భారతి శిబిరాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. విద్యార్థులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలనీ, గ్రామీణ ప్రజలతో కలిసి పనిచేయడం ద్వారా సామాజిక బాధ్యత, సహకార భావన, మరియు సేవా స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు. “Not Me, But You” అనే ఎన్ ఎస్ఎస్ నినాదం ప్రతీ విద్యార్థి జీవితంలో ఆచరణలో ఉండాలని ఆమె సూచించారు.
ఈ శిబిరంలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, సాక్షరత ప్రచారం, మహిళా సాధికారత, ఆరోగ్య అవగాహన, మరియు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. వెంకటేశం గారు, ఉపాధ్యాయులు డా. కిషోర్ గారు, బి. శ్రవ్య గారు మరియు రామకృష్ణ గారు, కోర్రేముల గ్రామస్తులు పాల్గొని, శిబిరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.