సొసైటీ వ్యవస్థాపక ఫౌండర్స్…లింగమల్ల దంపతుల
నవతెలంగాణ – మల్హర్ రావు
అంబెడ్కర్, పూలే,అంబెడ్కర్ రమాబాయి,సావిత్రి బాయి పూలే, పాతిమా షేక్ తదితర మహనీయులు జీవిత చరిత్ర గ్రంధాలను సంచార గ్రంధాలయ వాహనం ద్వారా ఉచితంగా ఇంటింటా చేర్చడమే ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 ద్యేయమని సొసైటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షురాలు లింగమల్ల జ్యోతి-శంకరయ్య అన్నారు. సొసైటీ పౌoడర్స్ అపత్కాలం,సమస్యలో ఉన్నప్పుడు నేనున్నానంటూ ధైర్యం చెప్పి ముందుకు వచ్చి సహకరించిన మహాదేవపూర్ మండలానికి చెందిన నేతకాని యువనాకుడు, ఉద్యమ కారుడు గోమాస సచిన్ కు సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అంబెడ్కర్ జీవిత చరిత్ర గ్రంథాలు పంపిణీ చేశారు. సొసైటీ 13 శాఖల అనుబంధంతో నిరంతరం సేవకార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు,యువత పాల్గొన్నారు.
మహనీయుల జీవిత చరిత్ర గ్రంథాలు ఇంటింటా చేర్చడమే ధ్యేయం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES