నిమ్మకాయను మనం ఎన్నో విధాలుగా వాడతాం. ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సమస్యలు తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు సమద్ధిగా ఉంటాయి. ఇది మన చర్మ రక్షణలో, సౌందర్య పోషణలో ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం..
ముఖ కాంతికి!
నిమ్మలో సహజసిద్ధమైన క్లెన్సింగ్ గుణాలు ఉంటాయి. వీటివల్ల చర్మం శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇందుకోసం నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఒక దాంతో ముఖం, మెడ మీద 5 నిమిషాల పాటు బాగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే ముఖం మీద వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలకు కూడా నిమ్మరసంతో చెక్ పెట్టచ్చంటున్నారు నిపుణులు.
జిడ్డు మాయం!
సాధారణ చర్మతత్వం ఉన్న వారితో పోల్చితే జిడ్డు చర్మతత్వం ఉన్న వారిలో సమస్యలు కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఇందుకు నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది. చర్మంలో సీబమ్ ఉత్పత్తిని బ్యాలన్స్ చేసి తద్వారా జిడ్డుదనం తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి దూదితో ముఖానికి పట్టించి.. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం ఉంటుంది.
ఇవి ప్రయత్నించండి!
కొందరికి గోళ్లు పొడవుగా, అందంగా పెరుగుతాయి. మరికొందరికి కొంచెం పొడవు పెరిగిన వెంటనే విరిగిపోతుంటాయి. ఈ సమస్య ఉన్న వారు ఒక గిన్నెలో కొద్దిగా నిమ్మరసం తీసుకుని దానిలో తగినన్ని నీళ్లు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కాసేపు గోళ్లను ముంచి ఉంచడం వల్ల అవి దఢంగా మారతాయి.
కొందరికి దంతాలు పసుపు పచ్చగా కనిపిస్తుం టాయి. ఇలాంటి వారు చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా మిశ్రమంలో నిమ్మచెక్కను ముంచి దాంతో పళ్ల మీద రుద్దాలి. ఈ చిట్కా నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.
నిమ్మలో ఔషధగుణాలు
- Advertisement -