నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు నేడు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. దరఖాస్తుల దాఖలుకు 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండిడేట్‌ను ఖరారు చేయనున్నది.
ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతున్నది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనుంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగానే మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ కేటాయించింది. గోపినాథ్మీద సానుభూతితో విజయం సాధిస్తామని గులాబీ పార్టీ అంచానా వేస్తున్నది. మరోవైపు ప్రజల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని అది కలసివస్తుందని భావిస్తున్నది. ఇప్పటికే ఇన్‌చార్జిలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను నియమించగా.. వారు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వచ్చేనెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు 14న కౌంటింగ్ నిర్వహించి విజెతను ప్రకటిస్తారు.