నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ కుటుంబంపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పూరి, రాంచీ హోటల్స్ కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది. 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ, తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. బిహార్‌లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
లాలూ, తేజస్వి యాదవ్‌కు బిగ్ షాక్..
- Advertisement -
- Advertisement -