- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుజాతనగర్ సమీపంలో ఐదు క్వింటాళ్ల గంజాయితో వెళ్తున్న కంటైనర్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.
- Advertisement -