Monday, October 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమ‌రో 13మంది బందీలు విడుద‌ల‌

మ‌రో 13మంది బందీలు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రెండేండ్ల తర్వాత గాజాలో బందీల విడుదల మొదలైంది. ఏడుగురు బందీలను రెడ్‌ క్రాస్‌కు హమాస్‌ అప్పగించిన విష‌యం తెలిసిందే. బందీలకు స్వాగతం పలుకుతూ ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి సందేశం పంపారు. తాజాగా మ‌రో 13 మంది ఇజ్రాయిల్ బందీల‌ను హ‌మాస్ విడుద‌ల చేసింది. వారిని తీసుకొని రెడ్‌ క్రాస్ గాజాలో అధికారుల‌కు అప్ప‌గించింది.

రెండేండ్లుగా సాగిన ఇజ్రాయిల్-గాజా యుద్ధానికి 20సుత్రాల శాంతి ప్ర‌ణాళిక‌తో ఎండ్ కార్డు ప‌డిన విష‌యం తెలిసిందే. శాంతి ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మ‌ధ్య త‌క్ష‌ణ కాల్పుల విర‌మ‌ణ‌, గాజా నుంచి ఇజ్రాయిల్‌ బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ తోపాటు ఇరుప‌క్షాల బందీల‌ విడుద‌ల వంటి అంశాల‌పై ఏకాభిప్రాయం కుదిరింది. ఈక్ర‌మంలో మొద‌ట‌గా ఏడుగురు బందీల‌ను విడుద‌ల చేసిన హ‌మాస్‌, ఆ త‌ర్వాత మ‌రో 13 బందీల‌ను ఇజ్రాయిల్ కు అప్ప‌గించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -