Tuesday, May 13, 2025
Homeఅంతర్జాతీయంహసీనా పార్టీకి షాక్‌

హసీనా పార్టీకి షాక్‌

- Advertisement -

– అవామీ లీగ్‌ను నిషేధించిన బంగ్లా ప్రభుత్వం
ఢాకా:
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి షేక్‌ హసీనాకు షాక్‌ తగిలింది. ఆమె పార్టీ అవామీ లీగ్‌ను బంగ్లాదేశ్‌లో నిషేధించినట్టు ఒక నివేదిక పేర్కొన్నది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నదని వివరించింది. ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఉపయోగించి అక్కడి ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేసింది. ముహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వం నుంచి వస్తున్న నివేదికలు త్వరలో అధికారిక ఉత్తర్వు జారీ చేయబడుతుందని చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ ట్రిబ్యునల్‌ (ఐసీటీ)లో విచారణ పూర్తయ్యే వరకు అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగుతుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే లక్ష్యంతో అవామీ లీగ్‌ను నిషేధించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. జులై 2024లో జరిగిన నిరసనలో ఫిర్యాదుదారులు, సాక్షులు, పాల్గొన్నవారి భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాత్కాలిక ప్రభుత్వం పేర్కొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -