Monday, October 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం

ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్‌లో అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారు.

అయితే ఈ సమావేశానికి రావాలని ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి మోడీని ఆహ్వానించారు. కానీ ఈ సమావేశానికి మోడీ గైర్హాజరవుతున్నారు. భారత్ తరఫున విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను పంపిస్తున్నారు. గాజాలో యుద్ధం ముగించడం, పశ్చిమాసియాలో శాంతి, ప్రాంతీయ భద్రత, కొత్త శకానికి నాంది పలకడం ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -