Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: సీఐటీయూ 

మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: సీఐటీయూ 

- Advertisement -

నవతెలంగాణ – జోగులంబ గద్వాల
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు అనుబంధం) రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయు జిల్లా కార్యాలయంలో మహాసభల పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా తుర్కియాంజిల్ లో ఈనెల 14,15 తేదీలలో మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలు రెండు రోజుల పాటు జరుగుతున్నట్లు తెలిపారు. మహాసభలలో గత మూడు సంవత్సరాల కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, కార్మికులపై ప్రభుత్వం విధించిన నిర్భందాల పై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకొంటామని తెలిపారు.

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దశల వారి ఆందోళనలో ఉద్యమాలు చేసిన సందర్భంగా ప్రభుత్వ, అధికార యంత్రాంగం అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయిందని విమర్శించారు.పట్టణాల స్థాయిలో పియఫ్, ESI, బట్టలు, సబ్బులు, నూనెలు, రైన్ కోట్లు వంటి కనీస సౌకర్యాలను కూడా అందించడంలో స్థానిక అధికార యంత్రాంగం విఫలమయ్యారని విమర్శించారు.

మరణించిన వారికి,పదవి విరమణ చేసిన వారికి, పియఫ్ లోన్లు అవసరం ఐన వారికి వేగంగా సేవలు అందించడంలో అధికార యంత్రాంగం విఫలం అయిందని విమర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికులను నియమించకపోవడంతో అదనపు పని భారలతో కార్మికులు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మహాసభలలో భాగంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు జాతీయ నాయకులు హాజరవుతారని,మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ పై కీలక నిర్ణయాలు జరుగుతాయని మహాసభలకు జోగులాంబ గద్వాల నుండి అధిక సంఖ్యలో హజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఏంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు అనుబంధం)జిల్లా కార్యదర్శి ఘట్టన్న, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ,గద్వాల మండల అధ్యక్షులు మహేష్ కుమార్, ఆనంద్, వెంకటన్న పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -