నవతెలంగాణ-హైదరాబాద్: ఏడు యుద్ధాలు ఆపానంటూ ప్రగల్భాలు పలుకుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరినని, తన పాలనలో ఎన్నో ప్రపంచ సంక్షోభాలు పరిష్కారం అయ్యాయని వ్యాఖ్యానించారాయన. అలాగే.. ప్రస్తుతం తన దృష్టి పాక్-అఫ్గన్ ఘర్షణలపై ఉందని అన్నారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగం, ఈజిప్ట్‌లో జరగబోయే గాజా శాంతి సదస్సు నేపథ్యంతో పర్యటన బయల్దేరిన టైంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో.. ‘ఇది నేను ఆపిన 8వ యుద్ధం(గాజా సంక్షోభాన్ని ఉద్దేశించి..). అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను. తిరిగి వచ్చాక దాని సంగతి చూస్తా. ఎందుకంటే.. యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని కదా అని వ్యాఖ్యానించారు.
ఇక ఇదిలా ఉంటే.. పాక్-అఫ్గన్ సరిహద్దుల మధ్య గత రాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీకర దాడులతో 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు అఫ్గన్ అధికారులు ప్రకటించారు. అయితే చనిపోయింది 23 మందేనని పాక్ సైన్యం అంటోంది.