Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంప్రజలను మోసం చేస్తోన్న కాంగ్రెస్‌

ప్రజలను మోసం చేస్తోన్న కాంగ్రెస్‌

- Advertisement -

– మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు కూడా అదే అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం, హైడ్రాలజీ అనుమతులున్నా.. ఆ విషయాన్ని మరుగుపరిచిన కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం… సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ సమర్పించిందనీ, 2021లో 113.795 టీఎంసీల నీటి లభ్యతకు ఆమోదం లభించిందని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ఆ జిల్లాలోని పరిశ్రమలకు, తాగునీటి కోసం సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని తెలిపారు. తమ హయాంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం పనులను పూర్తి చేస్తే…నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కేసులతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిందని హరీశ్‌ వాపోయారు. ఈ అంశాలన్నింటిపై అవగాహన లేని మంత్రి ఉత్తమ్‌… ‘ప్రాజెక్టుకు అనుమతులు లేవు…’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోని సాగునీటి విజయాలను కాంగ్రెస్‌ తన ఘనతగా చెప్పుకోవటం హాస్యాస్పదమని విమర్శించారు.
సీఎం అహంభావానికి నిదర్శనం…
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి విడుదల చేయని విధంగా సీఎం రేవంత్‌… ఎప్‌సెట్‌ పరీక్షా ఫలితాలను తన ఇంటి నుంచి విడుదల చేయటం ఆయన అహంభావానికి నిదర్శమని హరీశ్‌రావు మరో ప్రకటనలో పేర్కొన్నా రు. పాలన మీద, విద్యార్థుల మీద ఆయనకున్న చులకన భావానికి ఇది నిదర్శమని విమర్శించారు. ప్రజా పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -