నవతెలంగాణ-హైదరాబాద్: బండితో రోడ్డెక్కితే చాలు కొంత మంది సినిమాల్లో హీరోల్లా ఫీలైపోతున్నారు. తమ చేతిలోని వాహనాలతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వీడియో ఒకటి తాజాగా గ్రేటర్ నోయిడాలో బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి.. ఓవరాక్షన్ చేసిన వ్యక్తి తిక్క కుదిర్చారు.
మెయిన్ రోడ్డులో వేగంగా దూసుకుపోతున్న కారు..సడన్ బ్రేక్లు వేస్తూ పలు విన్యాసాలు చేస్తుంటాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో గ్రేటర్ నోయిడా ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించినందుకు సంబంధిత వాహనంపై నిబంధనల ప్రకారం ఈ-చలాన్ (రూ. 57,500/- జరిమానా) జారీ చేశారు.