నవతెలంగాణ – వలిగొండ రూరల్
వలిగొండ మండలం నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో, వలిగొండ మార్కెట్ యార్డులో సోమవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విదంగా 12 సెం.మీ వర్షం కురిసిందని, తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అధైర్యపడవద్దని ఆయన అన్నారు. రైతులు వడ్లను ఎత్తైన ప్రదేశంలో పోసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించేలాగా చూడాలని అధికారులకు సూచించారు.అనంతరం రాత్రి కురిసిన వర్షానికి మల్లెపల్లి గ్రామానికి చెందిన పల్లెర్ల సహదేవకు చెందిన ఇల్లు కూలిపోవడంతో ఎమ్మెల్యే వెళ్లి పరిశీలించి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని, అలాగే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్య భీమా నాయక్, నూతి రమేష్, చిట్టెడి జనార్దన్ రెడ్డి, వాకిటి అనంతరెడ్డి, పాశం సత్తిరెడ్డి, బోళ్ల శ్రీనివాస్, కంకల కిష్టయ్య, పల్సం సతీష్, ఉలిపే మల్లేశం, కాసుల వెంకన్న, పల్లెర్ల రాజు, లింగస్వామి వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే కుంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES